టి20 ప్రపంచకప్‌ లోగో విడుదల

Dec 8,2023 10:36 #Sports

2024 జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరగనున్న పురుషుల టి20 ప్రపంచకప్‌ లోగోను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) గురువారం విడుదల చేసింది. లోగోపై క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌తో పాటు ఈ ఫార్మాట్‌కు సరిపోయే విధంగా ఆ లోగోను ఐసిసి రూపొందించింది. ఈసారి టి20 ప్రపంచకప్‌ కప్‌ చేజిక్కించుకొనేందుకు 20జట్లు పోటీపడనున్నాయి. ఆఫ్రికా రీజియన్‌నుంచి చివరి రెండు బెర్తులు పూర్తి కావడంతో మొత్తం 20జట్లు రేసులో నిలిచాయి. ఐసిసి 2007లో టి20 ప్రపంచకప్‌ టోర్నీలను నిర్వహిస్తోంది. జట్లు: భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, కెనడా, ఐర్లాండ్‌, నమీబియా, నేపాల్‌, నెదర్లాండ్స్‌, ఒమన్‌, పపువా న్యూగినియా, స్కాట్లాండ్‌, ఉగాండా, అమెరికా.

➡️