ఎల్గార్‌ పరిషత్‌ కేసులో షోమా సేన్‌కు సుప్రీం బెయిల్‌

న్యూఢిల్లీ : ఎల్గార్‌ పరిషత్‌ కేసులో సామాజిక కార్యకర్త షోమా కాంతి సేన్‌కు సుప్రీం శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే బెయిల్‌పై వున్న కాలంలో ప్రత్యేక కోర్టుకు తెలియచేయకుండా ఆమె మహారాష్ట్రను వీడి బయటకు వెళ్ళరాదని ఆదేశించింది. నాగపూర్‌కు చెందిన కార్యకర్త సేన్‌ను అర్బన్‌ నక్సల్‌ పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2018 జూన్‌ 6న ఆమెను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆమెను అరెస్టు చేసి జైలులో పెట్టింది. సేన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌ యూనివర్శిటీలో సేన్‌ ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. 2017 ఆగస్టులో ఆమె భర్త తుషారకాంతి భట్టాచార్యను ఇదే విధంగా అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో ఏడుగురు ఇప్పటికీ కటకటాల వెనుక మగ్గుతున్నారు. ఫాదర్‌ స్టాన్‌ స్వామి జ్యుడీషియల్‌ కస్టడీలో వుండగానే 2021 జులైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

➡️