వేసవిలో జుట్టు సంరక్షణ ఇలా …

Mar 12,2024 08:25 #feachers, #hair care, #jeevana, #Summer

వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది. ఎండ వేడి నేరుగా తలకు తగలడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో చుండ్రు సమస్య అధికమవుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, జుట్టును సంరక్షించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

  •  బయటకు వెళ్లేప్పుడు, జుట్టును స్కార్ఫ్‌ లేదా క్యాప్‌తో కవర్‌ చేసి ఉంచాలి.
  •  కొంతమంది ఎండ వేడి తట్టుకోలేక, రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టులోని తేమ, నూనె తొలగిపోయి జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువసార్లు తలస్నానం చేయాలి.
  •  జుట్టు కుదుళ్లు బలంగా తయారయ్యేందుకు గోరువెచ్చని నూనెతో మర్దన చేయాలి.
  •  సాధారణంగా పొడవాటి జుట్టు ఉన్నవారికి వేసవి వేడి వాతావరణంలో జుట్టుపై శ్రద్ధ పెట్టడం పెద్ద సమస్య. కాబట్టి పొడవు జుట్టు ఉన్న వారు జుట్టు రాలకుండా, చిట్లకుండా ఉండేలా పైకి టై చేసుకోవాలి.
  •  సముద్రం, ఈత కొలనుల్లో స్నానాలు చేసినప్పుడు జుట్టు పొడిబారుతుంది. బలహీనంగా, పెళుసుగా మారుతుంది. కాబట్టి అటువంటిచోట స్నానం చేసిన తరువాత మంచి నీళ్లతో మరోసారి తలస్నానం చేయాలి.
  •  వేడినీటి స్నానం శరీరానికే కాదు, జుట్టుకు కూడా మంచిదే. అయితే వేడినీటి స్నానం తరువాత చివరగా జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే, జుట్టుకు బలం పెరిగి మెరుపుగా తయారవుతుంది.
  •  అలాగే తలస్నానం చేసిన తరువాత జుట్టు తడి ఆరాలని అదే పనిగా గట్టిగా రుద్దకూడదు. మెల్లిగా తుడవాలి.
  •  ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టుకు లేదా మాడుకు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయాలి.
  •  సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు తలస్నానం చేయాలి. అలా సాధ్యం కానప్పుడు ఆ లోషన్లకు బదులు కొబ్బరినూనెతో మర్దనా చేయాలి.
  •  వేసవికాలంలో జుట్టుకు నిమ్మరసం వాడినట్లయితే మరింత నిర్జీవంగా మారొచ్చు. కాబట్టి కాఫీ డికాషన్‌ లాంటి కండీషనర్లను వాడటం మంచిది.
➡️