భగత్‌సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌లో సమ్మర్‌ క్యాంపు

భగత్‌సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌లో సమ్మర్‌ క్యాంపు

భగత్‌సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌లో సమ్మర్‌ క్యాంపుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ భగత్‌సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌లో నిర్వహించే సమ్మర్‌క్యాంపును వేసవిలో పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఐద్వా, డివైఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. భగత్‌ సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌ ఆద్వర్యంలో సమ్మర్‌ క్యాంప్‌ మే, జూన్‌ నెలల్లో సుందరయ్య నగర్‌ కమ్యూనిటీ హాలు, తిరుపతిలో ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు నిర్వహించనున్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డాక్టర్‌ పి సాయి లక్ష్మి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ .జయచంద్ర, జిల్లా అధ్యక్షుడు నరేంద్ర, ఉపాధ్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ వేసవి సెలవులు అంటే బంధువులతో కలసి ఆట, పాట, కథలతో కాలక్షేపం చేసేవారని, నేడు వేసవి సెలవుల్లోనూ ఇళ్లకే పరిమితం అయిపోయి సెల్‌ ఫోన్లు, టి.వి ,వీడియో గేమ్‌లకు బానిసలవుతున్నారన్నారు. తిరుపతి భగత్‌ సింగ్‌ ట్యూషన్‌ సెంటర్‌లోనూ, బిటిఆర్‌ కాలనీలోనూ ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 28వ తేదీ ఆదివారం డ్యాన్స్‌, కరాటే, పాటలు, అందమైన చేతిరాత, క్విజ్‌, క్యారమ్స్‌, తెలుగు, ఇంగ్లీష్‌ తప్పులు లేకుండా రాయడం, చదవడం నేర్పిస్తారన్నారు. 15వేల ఇంగ్లీష్‌ పదాలు నేర్పిస్తారన్నారు. 9490300496 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.ుతుందన్నారు. సంస్కృతం పరివర్తనకు మార్గమని, అమూల్యమైన వారసత్వానికి విద్యార్థులు రాయబారులుగా మారాలన్నారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ కె.సాంబశివమూర్తి పాల్గొన్నారు.

➡️