‘మహేంద్రగిరి వారాహి’గా సుమంత్‌

Nov 17,2023 18:48 #telugu movies

సుమంత్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కాల్షీట్లపై సంతకాలు చేసినట్లుగా సమాచారం. ఈ మధ్య క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా మారిన ఆయన సినిమాల విషయంలో కాస్త నిదానంగా వెళ్తున్నారు. 1999లో రామ్‌గోపాల్‌ వర్మ ప్రేమకథతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్‌ ఇప్పటివరకు 30 నుంచి 35 సినిమాలు చేశారు. ధనుష్‌, సార్‌, సీతారామం సినిమాల్లో కనిపించిన ఆయన మళ్లీ ఇప్పుడు హీరోగా ‘మహేంద్రగిరి వారాహి’ అనే ఓ ఆసక్తికరమైన చిత్రానికి సైన్‌ చేశారు. ఇటీవలే విశాఖలో స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో ఈ సినిమా పూజాది కార్యక్రమాలు నిర్వహించి చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడిగా, మీనాక్షి గోస్వామి కథానాయికగా పరిచయమవుతున్నారు.

➡️