విజయవంతమైన లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

Apr 18,2024 22:50
కాకినాడ ట్రస్ట్‌ మల్టీ

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కాకినాడ ట్రస్ట్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చారిత్రా త్మక మొదటి కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌ వై.కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. డాక్టర్‌ శ్రీకాంత్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మెడికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లతోపాటు చెన్నైకి చెందిన ప్రముఖ వైద్య నిపుణుల బృందం నేతీత్వంలో విజయవంతంగా ఈ ఆపరేషన్‌ పూర్తి చేసినట్లు చక్రవర్తి తెలి పారు. అనస్థీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ బృందం, ఓటీ సిబ్బం ది మరియు ఐసియూ సిబ్బంది జాగురుకతతో ఈ ఆపరేషన్‌ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రామకృష్ణ అవ యవ దాత వారి కుటుంబ సభ్యులు, ట్రాన్స్ప్లాంట్‌ కోఆర్డినేటర్‌ స్వాతి, నర్శింగ్‌ సూపరింటెండెంట్‌ మహాలక్ష్మిలకు అభినం దనలు తెలిపారు. ఈ విజయం మా ఆసుపత్రి సామర్థ్యాలను బలోపేతం చేయ డమే కాకుండా మా హాస్పిటల్‌ వైద్య సంర క్షణ కోసం కొత్త పుంతలు తొక్కడానికి మా ర్గం సుగమం అయిందని హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్‌ గణేష్‌ ఆదిమూలం యూరాలజిస్ట్‌ మరియు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌గా, అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ మరియు బృందంతో కలిసి ఈ బృహత్తరమైన ఆపరేషన్‌ విజయంలో పాలు పంచుకున్నారని చక్రవర్తి తెలిపారు. డాక్టర్‌ సోమయాజులు నెఫ్రాలజిస్ట్‌ శస్త్రచికిత్సకు ముందు తగిన సూచనలు చేశారని తెలిపారు.

➡️