దర్జీలకు రాయితీ రుణాలివ్వాలి

Feb 28,2024 16:34 #Annamayya district
Subsidy loans should be given to tailors

టైలర్స్ డేని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి-బి.కొత్తకోట : టైలర్స్ డేని పురస్కరించుకొని శ్రీలక్ష్మి వెంకటేశ్వర టైలర్స్ వెల్ ఫైర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జ్యోతి చౌక్ బస్టాండ్ నుండి దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్ సంఘం అధ్యక్షుడు తాజ్ బాషా మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తుల కారణంగా దర్జీలు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఈ  ప్రభుత్వంలో అయినా దర్జీలకు ఫెడరేషన్, అలాగే ఇంటి స్థలాలతోపాటు పక్క గృహాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టైలర్లకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇంటి వద్ద టైలరింగ్ చేస్తున్న మహిళలకు కూడా వర్తింపచేయాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ మహిళ టైలర్లు కొరకు ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.కొత్తకోట మండలం ట్రెజరీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోవింద్ (మాస్ టైలర్), ఉపాధ్యక్షుడు వెంకటరత్నం చిన్న (చిన్న టైలర్), కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

➡️