నాకు స్టోరీ, డైరెక్టరే ముఖ్యం

Dec 20,2023 19:10 #kirangandur, #movie

ప్రభాస్‌ హీరోగా, ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘సలార్‌’ చిత్రం డిసెంబరు 2న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత విజయ్ కిరంగ్‌దూర్‌ చిత్రవిశేషాలను పంచుకున్నారు. ‘సలార్‌ సినిమాను 2021లో స్టార్ట్‌ చేశాం. కోవిడ్‌ కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. సినిమాలో 90 శాతం షూటింగ్‌ని తెలంగాణ, ఏపీలో చిత్రీకరించాం. ‘కెజియఫ్’ వంటి భారీ హిట్‌ మూవీ తర్వాత మా బ్యానర్‌లో ప్రభాస్‌ నటిస్తుండటం, ప్రశాంత్‌ నీల్‌ ఆ సినిమాను డైరెక్ట్‌ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాం. దాని కోసం మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. తొలి రోజు నిర్మాతగా నాకున్న నాలెడ్జ్‌కి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్‌కి చాలా తేడా ఉంది. ఏ భాషలోనైనా నిర్మాతగా నా ఆలోచనా విధానంలో మార్పు లేదు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఇండియన్‌ సినీ ఇండిస్టీ అవుతుంది. దాన్ని గ్లోబెల్‌ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభిప్రాయం. అలాగే బడ్జెట్‌ గురించి ఎక్కువగా డిస్కస్‌ చేయను. కాన్సెప్ట్‌ ఏంటి? కంటెంట్‌ ఎలా ఉంది. డైరెక్టర్‌ ఎవరు? కథ సెట్‌ అవుతుందా? ఈ సినిమాను తీయటానికి ఇది కరెక్ట్‌ సమయమేనా? అనే విషయాలపై ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను. తర్వాత నిర్ణయం తీసుకుంటాను. నాకు స్టోరి, డైరెక్టర్‌ ముఖ్యం’ అంటున్నారు విజయ్ కిరగందూర్‌.

➡️