స్టాక్‌ పాయింట్‌ హమాలీలకు ఉపాధి కల్పించాలి

Apr 24,2024 22:20

సమావేశంలో మాట్లాడుతున్న ఈఎస్‌. వెంకటేష్‌

                  బుక్కపట్నం: రూట్‌ మ్యాపింగ్‌ పేరుతో కొన్ని స్టాక్‌పాయింట్లలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న హామాలీలకు ఉపాధి లేకుండా చేయడం బాధాకరమని వారిని యధావిధిగా కొనసాగించకపోతే పూర్తిగా అన్ని స్టాక్‌ పాయింట్లను బంద్‌ చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్‌ వెంకటేష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుక్కపట్నం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే జాయింట్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకొని హమాలీలకు ఉపాధిని కల్పించాలన్నారు. లేనిపక్షంలో కొత్తగా మ్యాపింగ్‌ చేసిన గ్రామాలకు రేషన్‌ సరుకుల రవాణా నిలుపుదల చేస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 12 స్టాక్‌ పాయింట్స్‌ లో పనిచేస్తున్న హమాలీలకు కనీస సమాచారం ఇవ్వకుండా రూట్‌ మ్యాపింగ్‌ పేరుతో నిర్ణయం తీసుకోవటం దారుణమన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ వీటిని ఎలా మార్పుల చేపడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బ్యాళ్ళ అంజి,సివిల్‌ సప్లై హమాలి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి రాందాస్‌, మోమిన్‌, చిన్న సుబ్రహ్మణ్యం, నరసింహులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️