రేపు రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీ

Feb 3,2024 15:57 #Kakinada
State level running competition tomorrow

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ : సామర్లకోట – ఉండురు ఎన్ ఎఫ్ సీ ఎల్ రోడ్ లో ఈ నెల 4వ తేదీ ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు శ్రీకుమార రామ భీమేశ్వర ఎడ్ల పరుగు ప్రదర్శన కమిటీ నాయకులు తెలిపారు. సామర్లకోట – ఉండూరు రోడ్డులోని ఎన్ ఎఫ్ సి ఎల్ రోడ్డులో జరిగే ఏర్పాట్ల వద్ద వారు శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రదర్శనను కాకినాడకు చెందిన చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుణ్ణం చంద్రమౌళి ప్రారంభిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 సీనియర్ ఎడ్ల జతలు సుమారు 40 జూనియర్ ఎడ్ల జాతులు ఈ ప్రదర్శనలో పాల్గొనున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ డా. చందలాడ అనంత పద్మనాభం, ప్రముఖ రైతు చందలాడ పద్మరాజు (బాబ్జి )లు విచ్చేసి పాల్గొంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదర్శనల్లో అవార్డు లు పొందిన ఎడ్ల జతలు ఈ ప్రదర్శనలో పాల్గొంటుండగా జూనియర్, సీనియర్ విభాగాలుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ ఎడ్లు 1500 మీటర్లు, జూనియర్ ఎడ్లు 1000 మీటర్లు వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు. విజేత లైన ఎడ్లకు ప్రధమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు, షీల్డ్ లు అందించడం జరుగుతుందన్నారు. రాను రాను అంతరించిపోతున్న పశు సంపద పై రైతుల్లో అవగాహన పెంచుటకు 1992 నుండి సామర్లకోటలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కమిటీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బిక్కిన రంగా, పైన్ని చిట్టియ్య, కాటూరి జానకిరామ్, కొండపల్లి శ్రీను, రామకృష్ణ , పైన్ని గౌరీ చంద్, జి శివ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

➡️