సిఎం జగన్‌ పై దాడి – స్టాలిన్‌, బిఆర్‌ఎస్‌ నేతల స్పందన

తెలంగాణ : సిఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో … తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.

బిఆర్‌ఎస్‌ నేతలు కెటిఆర్‌, హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ జగన్‌ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ …సీఎం జగన్‌పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిన్న విజయవాడ సింగ్‌నగర్‌లో వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న సిఎం జగన్‌ పై దుండగుడు రాయితో దాడి చేశాడు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మను తాకి గాయం చేసింది. జగన్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️