కల్బుర్గి, గౌరీ లంకేష్‌ హత్య కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు

Special court will deal with Gauri Lankesh, MM Kalburgi murder cases CM Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు

బెలగావి : ప్రముఖ హేతువాద రచయితలు, సామాజిక ఉద్యమకారులైన ఎంఎం కల్బుర్గి, జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందిగా మంగళవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలు కూడా ఇదే మేరకు విజ్ఞప్తి చేశాయి. రచయిత, కన్నడ పరిశోధనా రంగంలో నిష్ణాతుడు అయిన ఎంఎం కల్బుర్గి 2015 ఆగస్టు 30న హత్యకు గురయ్యారు. ధార్వాడ్‌లోని ఆయన నివాసంలోనే ఈ హత్య జరిగింది. 2018-19లో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ”కుటుంబ సభ్యుల సాక్ష్యాధారాల విచారణ పూర్తయింది కానీ కోర్టులో విచారణ సాగుతోంది. ఇప్పటికే సుదీర్ఘ సమయం గడిచినందున ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా కల్బుర్గి భార్య ఉమాదేవి కోరారు. అందువల్ల ఇందుకు సంబంధించి అత్యవసరంగా చర్యలు చేపట్టాలి” అని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మూఢ నమ్మకాలపై పోరాడిన జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కూడా 2017 సెప్టెంబరు 5న జరిగింది. దర్యాప్తు బృందం 18 మంది నిందితులను అరెస్టు చేసింది. 1200 సాక్ష్యాధారాలను సేకరించింది. 500 రకాల సాక్ష్యాలు, ఇతర రుజువులు అందాయి. వాటన్నింటినీ చార్జిషీట్‌లో భాగంగా కోర్టుకు అందచేశారని ముఖ్యమంత్రి మరో ప్రకటనలో తెలిపారు. 2022 జులైలో కోర్టు విచారణ ప్రారంభించింది. కానీ ఇతర కేసులు చాలా పెండింగ్‌లో వుండడంతో కోర్టులో విచారణ మందగమనంతో సాగుతోందని ఆ ప్రకటన పేర్కొంది. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, కేసును విచారించేందుకు పూర్తి స్థాయి న్యాయమూర్తిని నియమించాల్సిందిగా గౌరీ లంకేష్‌

➡️