సంక్రాంతి కప్పు సాధించిన సౌత్ జోన్ సిసి చెన్నై జట్టు

Jan 17,2024 00:36

ప్రజాశక్తి – మేదరమెట్ల
కొరిశపాడు మండలంలో రావినూతల గ్రామంలో ఆర్ఎస్ సిఏ ఆధ్వర్యంలో శ్రీ భ్రమరా 30వ సంక్రాంతి కప్ ఈనెల 9నుండి 16వరకు టోర్నమెంట్‌ జరిగింది. ఈ క్రికెట్ యుద్ధానికి 16న తెరపడింది. సంక్రాంతి కప్పును సౌత్ జోన్ సిసి చెన్నై జట్టు కైవసం చేసుకుంది. బహుమతులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత గల్లా రామచంద్రరావు, ప్రముఖ సినీ నటులు రఘుబాబు చేతుల మీదుగా రూ.3లక్షల నగదు, క్రికెట్ కప్పును సౌత్ జోన్ సిసి చెన్నై జట్టుకు అందించారు. ద్వితీయ బహుమతిని జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్టు కైవసం చేసుకుంది. రూ.2లక్షల నగదు, కప్పును గళ్ళ రామచంద్రరావు, రఘుబాబు చేతుల మీదుగా అందుకున్నారు. తృతీయ బహుమతి శ్రీ సిసి చెన్నై జట్టు రూ.లక్ష నగదు, కప్పును ప్రముఖ సినీ నటులు రఘుబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ టోర్నమెంటులో బెస్ట్ టోర్నమెంట్ గా శ్రీసీసీకి చెందిన తరుణ్ ఎన్నికయ్యారు. ఉదయం జరిగిన మ్యాచ్లో జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై, శ్రీ సిసి చెన్నై జట్ల మధ్య జరగగా ముందుగా బ్యాటింగ్ చేసిన జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 171 పరుగు చేసింది. నాలుగు వికెట్లను కోల్పోయి. జట్టులో కెవిన్ 50 బంతుల్లో 70పరుగులు చేశాడు. వీటిలో 6ఫోర్లు నాలుగు సిక్సులు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీసీసీ చెన్నై జట్టు 18ఓవర్లలో 16పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో జిఎస్టి ఎక్సైజ్ చెన్నై జట్టు 65పరుగులతో విజయం సాధించారు. అనంతరం ఫైనల్ ఆడవలసిన చిక్కోలు చీట్స్ వైజాగ్ జట్టు అనివార్య కారణాలవల్ల పోటీలో పాల్గొన్న లేకపోయినందు వల్ల జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ జట్టు ఫైనల్ ఆడవలసి వచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ సెంట్రల్ సిసి జట్టు నిర్ణీత 12ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 125 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ జట్టు నిర్నిత 12ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 114పరుగులు మాత్రమే చేసి 11పరుగుల పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో సంక్రాంతి 2024క్రికెట్ కప్పును సౌత్ జోన్ సిసి చెన్నై జట్టు కైవసం చేసుకుంది. సోమవారం ఫైనల్స్ కోసం ఆడిన మ్యాచ్లో శ్రీ సీసీ చెన్నై, చిక్కోలు చీట్స్ వైజాగ్ జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 153పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చిక్కోలు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 155 పరుగులు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో సౌత్ జోన్ సిసి జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు తలపడాగా మొదటి బ్యాటింగ్ చేసిన సౌత్ సిసి జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 169 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ జట్టు 20ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 160పరుగులు చేసి తొమ్మిది పరుగులతో ఓటమిపాలైంది. దీంతో సౌత్ జోన్ సీసీ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అంటే ఫైనల్ మ్యాచ్ సిక్కోలు చిథిస్ వైజాగ్ సౌత్ జోన్ సిసి చెన్నై జట్ల మధ్య జరగవలసి ఉంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్‌సిఏ అధ్యక్షులు కారుసాల నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, ఇరు ప్రక్కల గ్రామాల క్రీడాభిమానులు పాల్గొన్నారు.

➡️