స్మాట్ మీటర్ల బిగింపును అడ్డుకోండి : సిపిఎం

Mar 20,2024 10:51 #anakapalle district

ప్రజాశక్తి-దేవరపల్లి(అనకాపల్లి) : మాడుగుల నియోజకవర్గంలో వ్వవసాయ పంపు సేట్లుకు స్మాట్ మీటార్లు బీగింపును రైతులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం అయిన ఓ ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ సందిట్లో సడిమియాలాగ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయపంపు సేట్లుకు, స్మాట్ మీటార్లు బీగింపును ప్రారంబించిందని దీన్ని రైతులు అడ్డుకోకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. వ్వవసాయపంపు సెట్లుకు ఉచితం విద్యుత్ అందిస్తామని చేబుతూనే రైతులకు, స్మార్ట్ మీటార్లు బిగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈమీటర్లు బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును మొదటిసారిగా రైతులే భరించాలని, ఆతర్వాత వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని, ప్రభుత్వం, నిర్ణయించిందన్నారు. ఎపిలో ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించారని కాని స్మాట్ మీటర్లను పెట్టే కార్యక్రమం చురుకుగా సాగుతోందని అదికూడా మాడుగుల నియోజకవర్గంలోమొదలు పెట్టారని తెలిపారు. మోటర్లుకు స్మాట్ మీటార్లు బిగింపు వల్ల మంచి ఫలితాలు సాదిస్తామని చేప్పి రైతును ప్రభుత్వ మోషం చేస్తుందని తెలిపారు రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వ డబ్బులు వేస్తుందని వాటిని రైతులు విద్యుత్ శాఖకు చేల్లించాలని చేబుతుందని తెలిపారు. ఉచిత విద్యుత్ అంటూనే రైతుల పికపై కత్తి పెడుతుందని తెలిపారు. రైతులపై అదనపు భారాన్ని మోపబో తోందన్న విమర్శలు వచ్చిన ప్రభుత్వం వెనక్కి తగ్గ కుండా ఇకపై వ్యవసాయ విద్యుత్ బిల్లులను రైతులు తమ జేబుల నుంచే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోందని గుర్తుంచుకోవాలి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రైతుల పేరుతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచించిందని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాలో కొత్తగా తెచ్చిన సంస్కరణలపై ఇంధన శాఖ కార్యదర్శి ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారని తెలిపారు. ప్రత్యేకంగా ఏపీ హరిత బంధన కార్పొరేషను ఏర్పాటు చేశామని, ఈ మీటర్ల. తద్వారా ప్రతి నెలా వచ్చే బిల్లును తామే చెల్లిస్తామని జీఓలో వెల్లడించామని ఇలావెల్లడిస్తూనే, మరోప్రక్క వ్యవసాయ పంపుసెట్లు ఏ నెలలో ఎంతెంత కరెంటు కాల్చుకొనే అవకాశం వుందో ప్రభుత్వం లెక్క గట్టింది. ఆ అంచనా యూనిట్ల విద్యుత్తు వాడే అవకాశం వుందన్నారు,ఆవిధంగా ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, ఆ మొత్తాన్ని నెల వారీగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుందని అజీఓలో మాత్రం ఎవరు భరించాలన్నది మాత్రం చెప్పడం లేదన్నారు. అసలు విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం. భవిష్యత్తు రైతులు ఖాతాలో డబ్బులు ఎలా వేస్తుదని ప్రశ్ననించారు. దాదాపు 20 ఏళ్లుగా సాఫీగా సాగిన ఈపధకానిక ఇప్పుడు మంగళం పాడుతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంబించి ఈపధకం అయిన తనయుడు ఈపధకానికి తూట్లు పోడుస్తున్నారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు పెంచాలన్నారు కాని. నిరంతర విద్యుత్ ఇచ్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెవన్నారు అదాని లాంటి కార్పొరేట్ వ్ సంస్థకు కట్టబెడుతుంతని తెలిపారు. వెంటనే వ్వవసాయ పంపు సేంట్లుకు స్మార్ట్ మీటర్లు బిగింపును రైతులు కలిసి కట్టుగా ఎక్కడికక్కడ ప్రతిఘటించాలని వెంకన్న పిలుపునిచ్చారు.

➡️