అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేయాలి

Dec 16,2023 16:47 #Vizianagaram
siezed illegal water plant

ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
న్యాయము జరిగే వరకు పోరాటం
పట్టణపౌరసంక్షేమసంఘం హెచ్చిరిక
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఒకటవ డివిజన్ పరిధిలోని అయ్యాప్పానాగర్ లో పూసర్ల మధు సూధన రావు అనే వ్యక్తి అక్రమంగా స్వాతీ ప్యూరి పైడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్ ను నడుపుతున్నారు. ఆయనకి భూగర్బాజల శాఖా అధికారులూ, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవ్వరూ అనుమతులు ఇవ్వలేదు, అయినా అక్రమంగా నీటివ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. మరో వైపు అయ్యాప్పా నగర్ లో ప్రజలు, సొంత ఇంటి దార్లు యెక్క బోర్లు ఇంకిపోయి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న యజమాని పూసర్ల మధుసూదన రావు ని ఆరెస్ట్ చేయాలని , అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చెయ్యాలనీ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు, అయ్యప్ప నగర్ పోరాట కన్వీనర్ యు ఎస్ రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్డీఓ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నా నుద్దేశించి వారు మాట్లాడుతూ ఆర్డీఓ న్యాయము చెయ్యండి అంటూ వారు నినాదాలు చేశారు. పోలీస్ వారిసమక్షం లో మున్సిపల్ అధికారులు వాటర్ ప్లాంట్ అక్రమని జూన్ 6 న మున్సిపల్ అది కారులు క్లోజ్ చేయడం జరిగిందన్నారు. అయినా ఆ తాళం బద్దలు గొట్టి అదే రోజు నుండి అక్రమంగా స్వాతీ ప్యూరీ పైడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్ ను పూసర్ల మదు నడుపుతున్నట్లు ధృవీకరించిన అధికారులు ఏడు నెలలైనా నేటికీ అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చెయ్యకుండా తాత్సారం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చేసి, యజమాని పూసర్ల మధు సూధన రావు ను తక్ష్ణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కోరుతు అనంతరం ఐద్వా, జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, ఎల్ బి జి నగర్ కార్యదర్శి బి.రమణ, గురజాడ నగర్ కార్యదర్శి రంబ శ్రీను, అయ్యాప్పా నగర్ కాలనీ అసోసియేషన్స్ కార్యదర్శి సుదీర్, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంది త్రినాథ్ లు మాట్లాడుతూ సీజ్ చేసే అధికారం ఆర్డీవో కి ఉన్నప్పటికీ ఆర్డీఓ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️