దొడ్డిదారిన రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల తరలింపు చట్టవిరుద్ధం : సిపిఎం

Nov 25,2023 09:35 #Andhra Pradesh, #CPIM

 

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దొడ్డిదారిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలనుకోవడం చట్టవిరుద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ విధ్వంసం : లోకేష్‌ విశాఖపట్నానికి దొడ్డిదారిన రాజధానిని తరలించి ఏమి చేస్తారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రశ్నించారు. అక్కడ పరిశ్రమలు, ప్రాజెక్టులను తరిమేసి ఏమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వేలకోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పరిశ్రమలూ జగన్‌ దెబ్బకు వేరే రాష్ట్రానికి వెళ్లాయని, ఇప్పుడు విశాఖ వెళ్లి ఏమి చేస్తారని లోకేష్‌ ప్రశ్నించారు. కోర్టులంటే జగన్‌కు లెక్కలేదా? : సిపిఐకోర్టులంటే జగన్‌కు లెక్కలేదా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వ శాఖలను దొడ్డిదారిన విశాఖకు తరలించాలనుకోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. కృష్ణానదితో సంబంధం లేదని కృష్ణా బోర్డును విశాఖకు తరలించడం న్యాయమా? అని ప్రశ్నించారు.

➡️