శశిథరూర్‌ డ్యాన్స్‌ వైరల్‌…

Apr 23,2024 00:05

తిరువనంతపురం : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ మరోసారి డ్యాన్స్‌ చేస్తూ మరోసారి మీడియాలోకి ఎక్కారు. మాజీ కేంద్రమంత్రి, కేరళలోని తిరువనంతపురంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపి అయిన శశిథరూర్‌ తాజా ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుండే మళ్లీ పోటీచేస్తున్నారు. మరో నాలుగురోజుల్లో ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన… తాను పోటీ చేసే నియోజకవర్గంలో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రచారంలో ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

➡️