పాక్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రాజా వ్యాఖ్యలపై షమీ కౌంటర్‌

Nov 22,2023 13:07 #Cricket, #shami

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో భారత జట్టుకు ఐసీసీ వేరే సెట్‌ బంతులను అందించిందని హసన్‌ రాజా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హసన్‌ రాజాకు భారత పేసర్‌ మహ్మద్‌ షమీ కౌంటర్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ లో జట్లకు బంతులను ఎలా కేటాయిస్తారనే విషయం కూడా హసన్‌కు తెలియదని ఎద్దేవా చేశాడు. ఈ చిన్న విషయం కూడా తెలియని వ్యక్తి పాక్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడారంటే నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇలాగే మాట్లాడితే హసన్‌ను చూసి జనాలు నవ్వుకుంటారని చెప్పాడు. బంతి రంగుపై, ఐసీసీ తీరుపై హసన్‌ చేసిన ఆరోపణలు అర్థరహితమని కొట్టి పారేశాడు. హసన్‌ రాజా తన ఆలోచనలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని షమీ చెప్పాడు. ప్రపంచ కప్‌ లో భాగంగా తాను ఆడిన మొదటి మ్యాచ్‌ లో ఐదు వికెట్లు, రెండో మ్యాచ్‌ లో నాలుగు, ఆ తర్వాతి మ్యాచ్‌ లో ఐదు వికెట్లు తీసినట్లు షమీ వివరించాడు. దీనిని పాకిస్థాన్‌ కు చెందిన కొంతమంది ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించాడు.

➡️