సెన్సెక్స్‌ 800 పాయింట్ల పతనం

Apr 12,2024 21:20 #Business

ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలు చవి చూశాయి. ముఖ్యంగా అమెరికాలో అంచనాలు మించి ద్రవ్యోల్బణం నమోదయ్యిందనే వార్తలు సూచీల్లో ప్రతికూలతను పెంచాయి. ప్రస్తుత ఏడాదిలో మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందన్న ఆశలను ద్రవ్యోల్బణ గణాంకాలు నీరుగార్చాయి. అదే విధంగా పెరిగిన చమురు ధరలు మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాలతో శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఉదయం 74,890 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం ఒత్తిడిలోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో తుదకు 793 పాయింట్లు పతనమై 74,245 వద్ద ముగిసింది. నిఫ్టీ 234.40 పాయింట్ల నష్టంతో 22,519 పాయింట్లకు జారింది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, టిసిఎస్‌, నెస్లే ఇండియా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.

➡️