లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి

Feb 13,2024 01:12

ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్‌పై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో విజయవాడ కేఎల్ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్, మోటివేషనల్ స్పీకర్ రాజశేఖర్ మాట్లాడారు. విద్యార్థులు చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అన్నారు. ప్రస్తుత విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొంటేనే ఉజ్వల భవిత ఉంటుందని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం మనిషి ఎదుగుదలకు పనికొచ్చే వాటిని నేర్చుకొని భవితకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో మిగిలిన విద్యార్థులతో నిత్యం పోటీ పడుతూ అనుకున్న గమ్యాన్ని చేరాలని అన్నారు. తల్లి, దండ్రులు, ఉపాధ్యాయుల కలల సాకారానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణమ్మ, సేవా సంస్థ ప్రతినిధులు నాగ వీరభద్రా చారి, బ్రహ్మారెడ్డి, సుందరరావు, ఏకాంబరేశ్వరరావు పాల్గొన్నారు.

➡️