పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : పెదవాల్తేరులో ఉన్న సన్‌ఫ్లవర్‌ ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం ఉదయం సైన్స్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. సుమారు వందమంది మూగ, చెవుడు (విభిన్న ప్రతిభావంతులయిన) విద్యార్థులు తమ ప్రతిభతో సైన్స్‌ నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కాలుష్య నివారణకు సంబంధించి నీటి సంరక్షణ చారిత్రక కట్టడాలు, గృహ ఉపకరణ వస్తువులను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ప్రదర్శన షిప్‌ యార్డ్‌ విశ్రాంత డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సాయి ప్రసాద్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ … దివ్యాంగ బాలలు తయారుచేసిన నమూనాలు ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. సంస్థ కరస్పాండెంట్‌ ఎంఎం.కుమారి, ప్రిన్సిపల్‌ కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️