పాలకొల్లు, ఉల్లంపర్రులో మెగా సైన్స్ ఫేర్ ప్రారంభం

Feb 2,2024 15:58 #West Godavari District
science fair in palakollu

ప్రజాశక్తి-పాలకొల్లు : దేశంలో అతిపెద్ద మెగా సైన్స్ ఫేర్ ను జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటరమణ శుక్రవారం ప్రారంభించారు. పాలకొల్లు, ఉల్లంపర్రు మాంటిస్సోరి హైస్కూల్లో 558 ప్రాజెక్టులతో 650 మంది విద్యార్థులతో కిమీ పొడవు ఉండే సైన్స్ స్టాల్స్ తో 3రోజులపాటు సైన్స్ స్టాల్స్ తో సైన్స్ ఫేర్ జరుగుతోంది. 2016లో ఇక్కడ పెద్ద సైన్స్ ఫేర్ నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం పొందారు. ఇపుడు ఆ రికార్డును బద్దలు గొట్టనున్నారు. పట్టణంలోని వివిధ స్కూల్ విద్యార్థులతోపాటు కోనసీమ జిల్లా నుంచి కూడా సైన్స్ ఫేర్ చూడటానికి విద్యార్థులు విచ్చేస్తున్నారు. ఒకే విద్యా సంస్థ నుంచి అత్యధిక మంది విద్యార్థులు పాల్గొన్న సైన్స్ ఫేర్ గా, అతి పొడవైన సైన్స్ ఫేర్ గా, అతి పెద్ద సైన్స్ ఫేర్ గా 3 రికార్డులు బద్దలు గొట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డా బాబ్జి చెప్పారు. ఇంకా టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, యునైటెడ్ కాపు క్లబ్ అధ్యక్షులు గాదె ఆంజనేయులు కార్యదర్శి పశ్యావుల రవికుమార్ కోశాధికారి ఇనుకొండ శేషాద్రి, గవర్నర్ డా ముచ్చర్ల సంజయ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమాక రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్ డైరెక్టర్లు మద్దాల వాసు, ఎం రాంప్రసాద్, ఎంఇఓలు శర్మ, గుమ్మళ్ళ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️