జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ కి శారదా స్కూల్ విద్యార్దులు ఎంపిక

Nov 30,2023 12:25 #Kakinada
sarada school students in bal batminton

ప్రజాశక్తి-అన్నవరం : జాతీయ స్థాయిలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు అన్నవరం శారద స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కేశవరావు పేటలో జరిగిన స్కూల్ గేమ్స్ లో బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు అండర్ 14, 17, 19 విభాగంలో తూర్పు గోదావరి తరపున శ్రీ శారదా విద్యార్థులు  అండర్ 14 విభాగంలో జి.నవీన్, జి.బాలాజీ, డిడి టి వీఎస్ ప్రసాద్, అండర్ 17 విభాగంలో ఎన్ఎస్ఎస్ వినయ్ అండర్ 19 విభాగంలో జి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లా అండర్ 14 తృతీయ స్థానం అండర్ 17 ద్వితీయ స్థానం అండర్ 19 తృతీయ స్థానం లభించింది. వీరిలో శారద స్కూల్ విద్యార్థులు అండర్ 14 విభాగంలో జీ నవీన్ అండర్ 17 విభాగంలో ఎన్ఎస్ఎస్ వినయ్ జాతీయస్థాయికి సెలక్ట్ అయ్యారు. త్వరలో జరగబోవు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్న విద్యార్థులను శారద స్కూల్ కరస్పాండెంట్ కె కృష్ణ వర్మ, ప్రిన్సిపల్ బి శ్రీనివాస్, పిఈటిలు కె సూరిబాబు, కె శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందించారు.

➡️