వేతనాలు అందక శానిటేషన్ వర్కర్లు ఇబ్బందులు

Mar 21,2024 12:28 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : గత మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో పాఠశాలలలో పనిచేసే శానిటేషన్ వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధ్యాహ్న భోజనపథకం, శానిటేషన్ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కొమ్ము సత్యవేణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గురువారం ఆమె ప్రజాశక్తి దినపత్రికతో మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాల్లో సుమారుగా 1693 పనిచేస్తున్నారని వీరికి గత జనవరి నెల నుంచి నేటి వరకు వేతనాలు అందలేదని ఈ నేపథ్యంలో కుటుంబం గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఒకవైపు నిత్యవసర ధరలు గ్యాస్, నూనె, పప్పు తదితర వంట సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అప్పులు కూడా పుట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 2646 కార్మికులకు అడిషనల్ మెను పడాల్సి ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నెల నెల వేతనాలతో పాటు బిల్లులు సక్రమంగా అందించే కార్మికుల ఆదుకోవాలని ఆమె కోరారు.

➡️