సందీప్‌ కిషన్‌-30 ప్రారంభం

Apr 23,2024 19:15 #movie, #sandep kishan

సందీప్‌ కిషన్‌ కెరియర్‌లో రాబోతున్న 30వ చిత్రం ‘ఎస్‌కె’-30. ‘ధమాకా’ దర్శకుడు త్రినాధ రావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మంగళవారం ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజరు కనకమేడల కెమెరా స్విచాన్‌ చేయగా, దిల్‌ రాజు క్లాప్‌ కొట్టారు. అనిల్‌ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌ రైటర్‌గా పని చేస్తున్నారు.

➡️