ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ నటి సాయిపల్లవి సోదరి పూజాకన్నన్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తాను ప్రేమించిన వినీత్ని పూజ త్వరలో వివాహం చేసుకోనుంది. తాజాగా పూజ, వినీత్ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి చేశారు. ఈ వేడుకలో సాయిపల్లవి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.