తాగునీటికి సాగర్‌ నీరు

Apr 18,2024 21:24 #andrapradesh, #bord, #krishna, #Telangana
  •  తెలంగాణకు 8.5, ఎపికి 5.5 టిఎంసిలు : కెఆర్‌ఎంబి ఆదేశాలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలుగు రాష్ట్రాల ఎండాకాలం తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ఎద్దడి దృష్ట్యా నాగార్జున సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించిన విషయం విదితమే. దాదాపు 14.195 టిఎంసిల వరకు నీరు అందుబాటులో ఉందని కెఆర్‌ఎంబి తెలిపింది. అందులో ఎపికి 5.5 టిఎంసిలు కేటాయించారు. మిగిలిన నీటిని హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగించడానికి తెలంగాణకు అనుమతినిచ్చింది. తెలంగాణ మంచినీటి అవసరాల కోసం 8.5 టిఎంసిలను వాడుకోవచ్చని ఈ మేరకు గురువారం కెఆర్‌ఎంబి సభ్యకార్యదర్శి డిఎం రాయిపురే ఆదేశాలు జారీ చేశారు.

➡️