వాలీబాల్‌ విన్నర్స్‌గా సెయింట్‌ ఆన్స్‌

Nov 23,2023 00:42

ప్రజాశక్తి – వేటపాలెం
వాలిబాల్ జట్టు జాతీయ స్థాయి పాటీలలో తమ విద్యార్థులు విన్నర్స్ గెలుపొందినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి.రమణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి, గుడ్లవల్లేరు లో నవంబర్ 18 నుండి 20 వరకు జరిగిన సిల్వర్ జూబ్లి సెలబ్రేషన్స్ సందర్భముగా జరిగిన జాతీయ స్థాయి గేమ్స్ మరియు స్పోర్ట్స్ పోటీలలో వాలీబాల్ పోటీలలో పాల్గొన్న 40 జట్లుతో పోటీపడి సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాల జట్టు విజ్ఞానయూనివర్సిటి జట్టు పై ఫైసల్స్ లో గెలిచి విన్నర్స్ గెలుపొందినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు మొయిద వేణు గోపాల రావు తెలిపారు. ఫైనల్స్ పోటీలో మొదటి ఇన్నింగ్స్లో 13 పాయింట్లు మరియు రెండవ ఇన్నింగ్స్ లో 14 పాయింట్లు తేడాతో జయ ప్రదంగా ఫైనల్స్ లో విన్నర్స్ గా నిలచి ట్రోఫిని సాధించినట్లు తెలిపారు. ఈ వాలీబాల్ జట్టులో బి.టెక్ చదువుతున్న విద్యార్థులు యస్. తాతాజి, ఆర్.విష్ణు బాబు, జి. సాయికృష్ణ, యం.మణికంఠ, కె. వెంకట శివా రెడ్డి, యం.ఆర్.వి.మణి కుమార్, కె.ఆండ్రూస్, ఆర్. రమణ, జి.వి.ఆర్. తేజారెడ్డి, డి.హరికృష్ణా రెడ్డి, కె.సాయి కుమార్, కె. సన్నిల జట్టు ఈ పోటీలలో పాల్గొన్నట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భముగా జరిగిన అభినందన సభలో సి. సుబ్బారావు, (డైరక్టర్, అక్రిడిటేషన్స్) కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజల్, వివిధ విభాగాధిపతులు, విద్యార్ధిని విద్యార్థులు, పాల్గొని వాలీబాల్ జట్టుకు అభినందనలు తెలియజేశారు.

➡️