ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి : ఎస్పీ అమిత్‌ బర్దర్‌

పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎప్పీ అమిత్‌బర్దర్‌

         అనంతపురం క్రైం : జిల్లాలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నగర పోలీసులను ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్డీపీవో కార్యాలయంలో నగర పోలీసు అధికారులతో సమావేశమై ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశం చేశారు. ముందుగా నగర పోలీసు స్టేషన్ల పరిధిలోని భౌగోళిక స్థితిగతులు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిస్థితులు, తదితరాలపై సమీక్ష చేశారు. ఆతర్వాత ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకపరిచినా, ఓటర్లను ప్రలోభపెట్టినా చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, సమస్యలు సష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలే పోలీసు లక్ష్యమనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. గొడవలు, అల్లర్ల జోలికెళితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని కౌన్సిలింగ్‌ ద్వారా వివరించాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టినా… తాయిలాల ఎర చూపి అక్రమాలకు పాల్పడాలనుకున్నా చర్యలు తప్పవని పేర్కొనాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, నగర సిఐలు రెడ్డెప్ప, క్రాంతికుమార్‌, ధరణీకిశోర్‌, ప్రతాప్‌ రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

➡️