అందరికీ విద్యా అందించే విద్యావిధానం కావాలి

sfi leader sanu on nep

ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను

ప్రజాశక్తి – క్యాంపస్(తిరుపతి): నూతన విద్యా విధానం (ఎన్ఈపి) వల్ల విద్యార్థులలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యలో విద్యార్థుల చేరికలు క్రమంగా తగ్గుతున్నాయని, కొంత మందికే విద్యా అందే విధంగా ఎన్ఈపి 2020 ఉందని అందుకే జాతీయ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల విద్యార్థుల ఆధ్వర్యంలో ఎన్ఈపి కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను పేర్కొన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్వియులో “నూతన విద్యా విధానం, నీట్ ను రద్దు ” చేయాలనే అంశం పై సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధులుగా ఆల్ ఇండియా అధ్యక్షులు సాను, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ లు హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సెమినార్ లో రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అమలు చేసి విద్యా వ్యవస్థ ను బ్రష్టు పట్టించి ప్రభుత్వ పాఠశాల లను ముసివేసే కుట్ర చేస్తుంది అని మండి పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా టీచర్స్ పోస్టులు భర్తీ చేయకుండా నాడు నేడు అంటూ మోసపూరిత విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు మాధవ్ కృష్ణ మాట్లాడుతూ విద్యా రోజు రోజుకు ఖరీదు అవుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా దూరం అవుతుంది అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భగత్ రవి మాట్లాడు నూతన విద్యా విధానం రద్దు చేయాలనీ ఢిల్లీ లో జనవరి 12 న పెద్ద ఎత్తున నిరసన జరిగింది అని, ఫిబ్రవరి 1 తేదీన చెన్నై లో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అని వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్స్ అశోక్, వినోద్,హరిత, యూనివర్సిటీ అధ్యక్షులు నరేంద్ర, నాయకులు శివ, పవన్, వీరేష్, హార్సత్ తదితరులు పాల్గొన్నారు.

➡️