ఎస్ఎఫ్ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

Dec 30,2023 15:29 #Kurnool
sfi anniversary

నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అవ్వాలి..సిఐటియు ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు మల్లికార్జున…

ప్రజాశక్తి-హోలగుంద : విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలకు నాంది పలికింన సంగం భారత విద్యార్థి పెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంగం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు మండల ఉపాధ్యక్షులు గంగాధర్ అధ్యక్షతన మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు మండల కార్యదర్శి మల్లికార్జున జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత విద్యార్థి పెడరేషన్ 1970వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఐదు మంది విద్యార్థులతో చదువు పోరాడు అనే నినాదంతో స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యయాలతో ఆవిర్భవించింది. విద్యారంగ సమస్యలపై పోరాడుతూ విద్యార్థుల పక్షాన ఉన్న ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎఫ్ఐ అని చెప్పవచ్చు అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్య రంగాన్ని పూర్తిగా విచ్చినం చేస్తుంది. రాష్ట్రా ప్రభుత్వాలు కూడా దీనికి వత్తాసు పలుకుతూ విద్యను ప్రయివేటికరణ చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేవిదంగా ఉంది కావున నూతన విద్య విధానాన్ని రద్దు చేయాలని ఇందుకోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గాది, పంప, పవన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️