డాలర్‌తో రూపాయి 85కి తగ్గొచ్చు..మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సీయల్‌ అంచనా

Dec 23,2023 21:05 #Business

హైదరాబాద్‌ : వచ్చే కొత్త ఏడాదిలో రూపాయి మారకం విలువ ఒత్తిడిని ఎదుర్కోవచ్చని.. లోహాలకు డిమాండ్‌ పెరగొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఒఎఫ్‌ఎస్‌) అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81ా85 మధ్య ట్రేడింగ్‌ కావొచ్చని ఎంఒఎఫ్‌ఎస్‌ తన కరెన్సీ, కమోడిటీ ఔట్‌లుక్‌ 2024లో విశ్లేషించింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం.. ఈక్విటీ, డెట్‌ విభాగంలో 25 బిలియన్‌ డాలర్లకు పైగా నగదు ప్రవాహనాలను ఆకర్షించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా 2024లో ఫెడ్‌ మూడుసార్లు రేట్లను తగ్గించవచ్చని అంచనా. 2024లో అమెరికా తన అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతోంది. డాలర్‌కు స్వల్ప ప్రతికూలత ఉండటంతో రూపాయి విలువ 81.00 – 85.00 శ్రేణీలో నమోదు కావచ్చు. 2021, 2022తో పోల్చితే 2023లో కమోడిటీలు చాలా సానుకూల ప్రారంభాన్ని కలిగి ఉన్నాయి. లోహాల తీరు ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉంటుంది. కొన్ని విభాగాల్లో ఆఫ్‌టేక్‌ చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇది లోహాల డిమాండ్‌లో పునరుద్ధరణను సూచిస్తుంది.

➡️