రన్నరప్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీఫైనల్లో టాప్‌సీడ్‌ చేతిలో పరాజయం

Jan 14,2024 22:30 #Sports

కౌలాంపూర్‌: మలేషియా ఓపెన్‌ సూపర్‌ా1000 పురుషుల డబుల్స్‌ రన్నరప్‌గా భారత జోడీ నిలిచింది. ఆదివారం జరిగిన మూడుసెట్ల హోరాహోరీ ఫైనల్లో భారతజోడీ టాప్‌సీడ్‌, చైనా జంట చేతిలో ఓటమిపాలైంది. ప్రపంచ రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి తుదిపోరులో తడబడ్డారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత జంట 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ వాంగ్‌-లియాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. తద్వారా భారత ద్వయం రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 58 నిమిషాలపాటు సాగిన పోరులో తొలి సెట్‌ గెలిచినా తర్వాత రెండు సెట్లలో ఓడటంతో భారత ద్వయానికి పరాభవం తప్పలేదు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన భారత ధ్వయం రెండో గేమ్‌లోనూ పోరాడారు. ఓ దశలో 18-19పాయింట్లతో చేరువైనా.. వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఆ గేమ్‌ను కోల్పోయారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తొలుత ఓ దశలో 10ా3పాయింట్లతో ఆధిక్యతలో నిలిచారు. ఆ గేమ్‌ అర్ధభాగం ముగిసేసరికి 11ా6తో ఆధిక్యలో నిలిచారు. ఆ తర్వాత ఒత్తిడి గురై వరుసగా పాయింట్లను చేజార్చుకొని 14-14 పాయింట్లతో సమంగా నిలిచారు. కానీ చైనా ధ్వయం వరుసగా పాయింట్లు సాధించడంతో భారత జంట పాయింట్లు సాధించడంలో వెనుకబడడంతో మ్యాచ్‌ చేజారింది. క్రమంగా మ్యాచ్‌పై పట్టుబిగించిన చైనా జోడీ.. చివరి వరకూ అదే కొనసాగించి విజేతగా నిలిచింది.ఇక పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను అన్‌సీడెడ్‌, డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ ఆంటోన్సెన్‌ చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో ఆంటోన్సెన్‌ 21-14, 21-13తో చైనాకు చెందిన 7వ సీడ్‌ షీ యుాక్యూపై నెగ్గాడు. షీాయుాక్యూ సెమీస్‌లో టాప్‌సీడ్‌ విక్సర్‌ అక్సెల్సన్‌(డెన్మార్క్‌)ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకొచ్చాడు. ఇక మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను చైనీస్‌ తైపీకి చెందిన టాప్‌సీడ్‌ అన్‌-సాేయంగ్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో అన్‌ాసాేయంగ్‌ 10-21, 21-10, 21-18తో 4వ సీడ్‌, తైపీకే చెందిన తైజుాయింగ్‌పై గెలిచింది.

➡️