తహశీల్దార్‌ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

Feb 7,2024 12:50 #ramanya, #tasildar

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో తహశీల్దార్‌ రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్‌ డీడ్‌ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

➡️