ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రూ.7 లక్షల నగదు సీజ్‌

గుంతకల్‌ రైల్వే (ప్రకాశం) : త్వరలో సాధారణ ఎన్నికలున్న వేళ … ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో … శనివారం రాత్రి ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఇద్దరి వద్ద రూ.7 లక్షల నగదును పోలీసులు గుర్తించి సీజ్‌ చేశారు.

గుంతకల్‌ రైల్వే ఎస్పీ కే.చౌడేశ్వరి ఉత్తర్వులు మేరకు, నెల్లూరు రైల్వే డిఎస్పి సి.విజరు భాస్కర్‌ రావు పర్యవేక్షణలో, శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఒంగోలు రైల్వే సర్కిల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం ఎన్‌.శ్రీకాంత్‌ బాబు, సీఐ, తన సిబ్బంది ఎం మురళి, ఎం. శ్రీనివాసులు, కే. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాధారణ తనిఖీలు చేపట్టారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌ వద్ద జరుపుతున్న తనిఖీలలో రైలు నం.17209 శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ నుండి కావలిలో ఎక్కి ఒంగోలులో దిగిన ఇద్దరు ఒక అనుమానాస్పదమైన సంచితో ఉండగా పోలీసులు దానిని తనిఖీ చేశారు. వారు రూ.7 లక్షల నగదు తీసుకెళుతున్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు. వారు 1) పెసల పద్మ, (గోపాల్‌, వీఆర్వో, కావలి భార్య), 2) పెసల నిఖిల్‌ కుమార్‌లుగా తెలుసుకున్నారు. ఇద్దరూ నెల్లూరు జిల్లా కావలికి చెందినవారు. వారి సొంతూరు గిద్దలూరు. ఆ ఏడు లక్షలు డబ్బులు తాలూకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేసి పంచనామా రాశారు. ఈసిఐ మార్గదర్శకాల ప్రకారం, తగిన ఉత్తర్వుల కోసం జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ, ప్రకాశం జిల్లా, ఒంగోలుకు కు తదుపరి ఉత్తర్వులు నిమిత్తం పంపబడుతుందని తెలిపారు.

➡️