ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టండి

Nov 20,2023 00:38 #palnadu district

 

వినుకొండ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్‌ రెడ్డి అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో మండల రైతు సంఘం కార్యదర్శి రాజారపు ముని వెంకటేశ్వర్లు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 27, 28 తేదీలలో కార్మిక, రైతు సంఘాలు నిర్వహిస్తున్న మహా ధర్నాను విజయవంతం చేయా లని పిలుపు నిచ్చారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కౌలు రైతులకు రుణాలన్నించి ఆదు కోవాలని డిమాండ్‌ చేశారు. పట్టణ సిఐటియు గౌర వాధ్యక్షులు బొంకూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దుచేసి కార్మికుల హక్కు లను పునరుద్ధరించాలని, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుమల లక్ష్మి, అంగలకుదురు ఆంజనేయులు, రంజాన్‌ బి, రైతు సంఘం నాయ కులు కోటిరెడ్డి, సత్యనారాయణ, బండి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️