ప్రసార భారతి చైర్మన్‌గా మాజీ అధికారి నవనీత్‌ సెహగల్‌

 న్యూఢిల్లీ :   ప్రభుత్వ ప్రసార సంస్థ ‘ప్రసార భారతి’ చైర్మన్‌గా మాజీ అధికారి నవనీత్‌ సెహగల్‌ను కేంద్రం నియమించింది. సెలక్షన్‌ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టినట్లు శనివారం విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. మూడేళ్ల కాలం లేదా సెహగల్‌కు 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నట్లు సమాచారం.

2020 ఫిబ్రవరిలో సూర్యప్రకాష్‌ రాజీనామా చేసినప్పటి నుండి ప్రసార భారతి చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సెలక్షన్‌ కమిటీకి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ నేతృత్వం వహించారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌, రాష్ట్రపతి నామినేట్‌ చేసిన వ్యక్తి మిగిలిన సభ్యులుగా ఉన్నారు.

➡️