గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఫలితాలు అదుర్స్‌

Apr 22,2024 21:58

సాలూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వరుసగా రెండో ఏడాది వచ్చాయి. గత ఏడాది రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలవగా ఈ ఏడాది 97 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలోనే నిలిచింది. ప్రధానంగా సాలూరు గిరిజన సంక్షేమ సహాయ అధికారి పరిధిలో ఉన్న పాఠశాలల్లోనూ ఉత్తమ ఫలితాలు వచ్చాయి. సాలూరు, పాచిపెంట, మక్కువ, పార్వతీపురం మండలాల్లోని పాఠశాలల్లో 617 మంది పదోతరగతి విద్యార్థులు 614 మంది హాజరయ్యారు. మండలంలోని మావుడి, మామిడిపల్లి, కురుకుట్టి, రావికోన, పాచిపెంట, బడ్నాయికవలస, సరాయివలస, వేటగానివలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వందశాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. గిరిజన సంక్షేమ సహాయ అధికారి పరిధిలో ఉన్న పాఠశాలల్లో 97.41శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే పట్టణంలోని జ్యోతిబా పూలే బిసి గురుకుల బాలికల పాఠశాల లో 79 మంది పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. నీలబోను లిఖిత 556 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్‌ మూకల పెంటయ్య చెప్పారు. 500 మార్కులు పైగా సాధించిన 45 మంది వున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. శత శాతం ఫలితాలు సాధించిన శ్రీజన్‌ పార్వతీపురం : టెన్త్‌ ఫలితాల్లో స్థానిక శ్రీజన్‌ హై స్కూల్‌ శత శాతం సాధించింది. ఈ పాఠశాలకు చెందిన ఎస్‌ .భాను సుజనా 583 మార్కులు సాధించగా, కె.పార్వతీశం 563, బి.హాసిని 549 మార్కులు సాధించారు. 13 మంది విద్యార్థులు 500 మార్కులకు పైబడి సాధించారు. శ్రీజన్‌ స్కూలు ప్రారంభించి రెండో బ్యాచ్‌కె అత్యంత ఉత్తమ ఫలితాలు సాధించడం పట్టణ పాఠశాల మేనేజింగ్‌ డైరెక్టర్‌ యు.శ్రీను అభినందనలు తెలిపారు.సాలూరురూరల్‌ : మండలం టెన్త్‌ ఫలితాల్లో 94శాతం ఉత్తీర్ణత సాధించిందని ఎంఇఒ ఎం.రాజ్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని 854 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 827 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, ఎపి మోడల్‌ స్కూల్‌కు చెందిన కె.మౌనిక 583 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. మండలంలోని మామిడి పల్లి, కురుకుట్టి, మవుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో శత శాతం ఉత్తీర్ణత సాధించారు. అంటివలస, కొత్తవలస ఆశ్రమ పాఠశాలలో 98శాతం ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ తెలిపారు.కొమరాడ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో గిరిజన విద్యార్థులు మరోసారి ప్రతిభ కనబరిచారు. కొమరాడ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి 71 మంది పరీక్ష రాయగా70 మంది ఉత్తీర్లైనట్లు ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న మువ్వలవినీత్‌ 552, పువ్వల బన్నీ 525, దుమ్ముడి దుర్గాప్రసాద్‌ 520 మార్కులతో టాపర్లగా నిలిచారు. భామిని : మండలంలోని 7 ప్రభుత్వ, 2 ప్రవేట్‌ పాఠశాలల నుంచి 473 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 444 మంది ఉత్తీర్ణులైనట్టు ఎంఇఒ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఎంపి మోడల్‌ స్కూల్‌కు చెందిన జి.లావణ్య 573, స్థానిక జిల్లా పరిషత్‌ హై స్కూల్‌కు చెందిన బి.నాయుడు 553, బత్తిలి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లో బి. సింధు 570, బాలేరు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ ఎల్‌.పవన్‌ 551, పెద్దదిమిలి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌కు ఎం.తనూజా 518, భామిని కెజిబివి పాఠశాలకు చెందిన ఎం.గీతాలక్ష్మి 541 మార్కులు, అంబేద్కర్‌ గురుకుల పాఠశాలకు చెందిన జి.భాగ్య 544 మార్కులు, బత్తిలి కానోసా ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థిని అల్లాడ సోనియా 580 మార్కులు సాధించి మండలం టాపర్‌గా నిలిచిందని ఎంఇఒ తెలిపారు.మక్కువ : టెన్త్‌ ఫలితాల్లో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.పూజిత 579 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎపి మోడల్‌ పాఠశాల 100శాతం ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు. ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల, అనసభద్ర ఏకలవ్య పాఠశాల, వెంకట బైరిపురం, ఎ.వెంకంపేట, శంబర ఉన్నత పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.సీతంపేట ఐటిడిఎ 98 శాతం సీతంపేట ఐటిడిఎ పరిధిలో గల 44 ఆశ్రమ, గురుకుల విద్యాలయాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరైన 1708 మందికి గానూ 1675 (98.07శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. శత శాతం సాధించిన పాఠశాలలు 28 ఉన్నాయి. వీటిలో మన్యం జిల్లాలో 16, శ్రీకాకుళంలో 12 పాఠశాలలు ఉన్నాయి. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పిఒ కల్పనాకుమారి, డిడి అన్నదొర, పిఎంఆర్‌సి ఎటిడబ్ల్యుఒలు అభినందించారు. అదేవిధంగా పులిపుట్టి సమీపంలో ఉన్న భారతి ఇంటర్నేషనల్‌ పాఠశాలలో 36 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 36 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాలకు చెందిన మోక్షజ్ఞ విద్యార్థి 575 మార్కులు సాధించాడు. వీరిని ప్రిన్సిపల్‌ నవీన్‌, కరస్పాండెంట్‌ పెంటయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ మండలంలోని నర్సిపురం విద్యానగర్‌లో గల సురేష్‌ స్కూల్‌ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో తన సత్తాను చాటారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 210 విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 98.57 శాతం విజయాన్ని నమోదు చేశారు. వీరిలో వీరిలో సిహెచ్‌ వసంతకుమారి 582, జి.శరణ్య 579, వి.ప్రదీప్‌ 552 మార్కులు సాధించి స్కూల్లో టాపర్లుగా నిలిచారు. వీరిని కరస్పాండెంట్‌ గుడ్ల ప్రసాదరావు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.తమ్మినాయుడు పాఠశాల విద్యార్థులు విజయదుంధుబిపాలకొండ : పదో తరగతి ఫలితాల్లో పాలకొండ తమ్మినాయుడు పాఠశాల విద్యార్థులు విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఎస్‌.నమిత 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గురుబిల్లి శ్రీవల్లి 583, ఇసుకపట్ల విశాల్‌ 580, రౌతు సంతోష్‌ కుమార్‌ 580, మహేశ్వరి 576 మార్కులు సాధించారు. 84 మందిలో 550 మార్కులు పైబడి 20 మంది, 500 మార్కులు పై బడి 51 మంది సాధించారు. వీరిని తమ్మినాయుడు విద్యాసంస్థలు అధ్యక్షులు శెట్టి నారాయణమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్‌ అశోక్‌ కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. తిరుపతి రావు, పాఠశాల ఏఓ జి. తిరుపతి రావు అభినందనలు తెలియజేశారు. అలాగే పాలకొండ పట్ణంలోని బోణంవీధికి చెందిన మండల కీర్తన 591 మార్కులు సాధించింది. ఈమె స్థానిక రవీంద్ర భారతి స్కూల్‌లో చదువుతోంది.

➡️