కళకళలాడుతున్న అంగన్వాడీ కేంద్రాలు

reopen anganwadi centers after 42days strike

ప్రజాశక్తి-విజయవాడ : గత 42 రోజులుగా అంగన్వాడీల సమ్మెతో మూతపడ్డ అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెరుచుకున్నాయి. కేంద్రాలకు చేరుకున్న చిన్నారులు ఆట, పాటలతో  సందడి చేస్తున్నారు. బాలింతలు, చిన్నారులు, గర్భిణీకు పౌష్టికాహారం అందించే ఈ కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె సందర్భంగా అనేక చోట్ల లభ్దిదారులు పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు.  ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించిన సంగతి విదితమే.

➡️