కాంగ్రెస్‌ తణుకు అభ్యర్థిగా రామారావు నామినేషన్‌

తణుకు:కాంగ్రెస్‌ తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా కడలి రామారావు సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బివి.రమణకు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. తొలుత ఉండ్రాజవరం జంక్షన్‌లోని తన నివాసం నుంచి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఎం నాయకులు కామన మునిస్వామి, కాంగ్రెస్‌ పిసిసి సభ్యులు దీర్సిపో రామకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తణుకు రూరల్‌: బిఎస్‌పి తణుకు నియోజకవర్గ అభ్యర్థిగా ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామానికి చెందిన ఆకుమర్తి ధనుంజయ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బివి రమణకు అందజేశారు.

➡️