రజనీకాంత్‌ 171 చిత్రం ‘కళుగు’?

Apr 5,2024 20:34 #New Movies Updates, #rajanikanth

తమిళ హీరో రజనీకాంత్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఆయనకు ఇది 171వ చిత్రం. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 22న ప్రకటించనున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా కోసం ‘కళుగు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. దీనికి తెలుగులో ‘డేగ’ అని అర్థం. రజనీ పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం ఈ పేరును ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో రజనీకాంత్‌ బంగారం స్మగ్లర్‌గా మునుపెన్నడూ చూడని క్యారెక్టరైజేషన్‌తో కనిపించనున్నారు. ఆయన పాత్రలో ప్రతినాయక ఛాయలు కూడా ఉంటాయని తెలిసింది. టైటిల్‌ ప్రకటనరోజే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

➡️