‘ఉపాధి’ కల్పనలో రాజవొమ్మంగి మొదటి స్థానం 

ఏపీవో సురేష్ కుమార్
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయితీలలో ఉపాధి పనులు కల్పించడంలో రాజీవమ్మంగి మండలం రంపచోడవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచిందని ఉపాధి హామీ పథక ఏపీవో సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. ఆదివారం ఆయన మండలంలో జరుగుతున్న పలు ఉపాధి పనులను పర్యవేక్షించారు,సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో 8,400 కుటుంబాలు జాబు కార్డులు కలిగి ఉండగా, అందులో ఇప్పటికే సుమారు 3000 కుటుంబాలకు పైబడి వంద రోజులు పని కల్పించడం జరిగిందని ఏపీవో తెలిపారు. ఉపాధి హామీ పథకం చరిత్రలో మండలంలో మొదటిసారిగా 6,54,047 పని దినాలు మార్చి నెలాఖరు నాటికి సాధించడం జరిగిందని తెలిపారు. ఏడాదికి సగటున 77.48 రోజులు పనులు కల్పించినట్లు తెలిపారు. ఉపాధి కూలీలకు ఈ ఏడాది. 17.84 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఉపాధి పనుల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయన వెంట పలువురు ఉపాధి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

➡️