రఘురామకృష్ణరాజుకు రూ.40 కోట్ల జరిమానా

Nov 26,2023 10:25 #MP, #Raghuramakrishna Raja

ప్రజాశక్తి-అమరావతి: ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఈడీ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ సన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఐబీఎస్‌ఈపీఎల్‌)లోకి మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ రూ.202 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబ­డులను 2011 మార్చి 24న ఇన్వెస్ట్‌ చేసింది. ఇండ్‌ భారత్‌ సన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సేకరించిన రూ.202 కోట్లలో రూ.200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా.. ఇండ్‌ భారత్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఉత్కల్‌)కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధుల తరలింపుపై ఈడీ విచారించి 2017లో షోకాజ్‌ నోటీసులిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న రూ.40 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

➡️