రఘవేంద్ర స్కూల్ వీడ్కోలు వేడుకలు

Mar 29,2024 00:13 ##School #teacher #students

ప్రజాశక్తి – చీరాల
విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనదని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ గవిని మణి కుమార్ అన్నారు. పాఠశాల పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవాలంటే 10వ తరగతి కీలకమని అన్నారు. అప్పుడే విద్యార్థికి ఉన్నటువంటి ఆకాంక్షను బట్టి ఉన్నత విద్యకు మార్గం ఏర్పడుతుందని అన్నారు. ఆ మార్గాన్ని తానే ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి చదువుతూ పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్థులను అభినందిస్తూ వీడ్కోలు సభ ఏర్పాటు చేస్తారని అన్నారు. విద్యార్థులకు దిశ, నిర్ధేశం చేస్తూ వీడ్కోలు పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈసందర్భంగా బాపట్ల జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో ఉమా మహేశ్వరరావు, నక్కల శ్రీనివాసరావు, పావని, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️