ఆర్టీసీ కార్మికుల నిరసన

Jan 20,2024 00:00

ప్రజాశక్తి – అద్దంకి
స్థానిక ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తూ, దుర్భాషలాడుతూ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందని ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు పి చిరంజీవి, డిపో ప్రెసిడెంట్ అబ్దుల్ వహీద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ఎదుట గేట్ మీటింగ్‌ నిర్వహించారు. అసిస్టెంట్ మేనేజర్ వలన డిపో కార్మికులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఈ పోకడలు మానుకోకపోతే కార్మికులు సత్తా చూపుతారని అన్నారు. తమ ఇష్టారీతిన సర్వీసును నిలుపుదచేయడం, పునర్ధించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉద్యోగులకు ఫోర్స్ డే లీవులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సెక్టార్‌లో లేనటువంటి అభిషేటిజంను 47మంది ఉద్యోగులకు ఈ రెండు నెలల కాలంలో సెలవు దినాలుగా వేసిందన్నారు. డ్రైవర్లను, కండక్టర్లను కలెక్షన్ తక్కువ వస్తే ఎడాపెడా దుర్భాషలాడడం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని సర్వీసులకు కిలోమీటర్లు పెంచి ఉద్యోగులను పరోక్షంగా బలి తీసుకుంటుందని అన్నారు. ఇలాంటి ఉద్యోగిని వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే మరింత మంది కార్మికులు బలిదానం ఇవ్వాల్సి వస్తుందన్నారు. అసిస్టెంట్ మేనేజర్‌ను బదిలీ చేసే వరకు పోరాటాలు జరుగుతాయని అన్నారు. ఆదివారం నుండి రిలే నిరాహార దీక్షలు జరుపుతామని తెలిపారు. కార్యక్రమంలో సురేష్, సుబ్బరామయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, గ్యారేజీ సెక్రెటరీ వివేక్ పాల్గొన్నారు.

➡️