అందుబాటులోకి తిరుచానూరు రైల్వేస్టేషన్‌8 రైళ్లకు ఇక్కడే స్టాపింగ్‌ స్టేషన్‌ నుంచే ఆర్టీసీ బస్సులు

అందుబాటులోకి తిరుచానూరు రైల్వేస్టేషన్‌8 రైళ్లకు ఇక్కడే స్టాపింగ్‌ స్టేషన్‌ నుంచే ఆర్టీసీ బస్సులుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎట్టకేలకు తిరుచానూరు రైల్వేస్టేషన్‌ ప్రారంభించకనే అందుబాటులోకి వచ్చింది. తిరుపతి రైల్వేస్టేషన్‌ మరమ్మతుల నేపథ్యంలో అక్కడ రైళ్లను నిలిపేందుకు ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో ఎనిమిది రైళ్లకు కొత్తగా నిర్మించిన తిరుచానూరు రైల్వేస్టేషన్‌లోనే నిలిపేయనున్నారు. బుధవారం నుంచి చెన్నరుకి వెళ్లే రైళ్లన్నీ తిరుచానూరు రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లనున్నాయి. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, శేషాద్రి, ఎగ్మూర్‌ తదితర ఎక్స్‌్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు ఇక్కడనుంచే బయల్దేరనున్నాయి. యాత్రికులకు ఇబ్బంది కలగకుండా తిరుమలకు, రేణిగుంటకు, తిరుపతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలకు, తిరుపతికి, రేణిగుంట ఛార్జీలను ఆర్టీసీ డిపో మేనేజర్‌ డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రావడంతో ప్రయాణికుల రద్దీ కనిపించింది. రైల్వేస్టేషన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి త్వరలోనే అధికారికంగా తిరుచానూరు రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్నారు.

➡️