RR vs DC: ఢిల్లీ గెలిచేనా..!

Mar 28,2024 13:23 #2024 ipl, #Cricket, #Sports

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరియు ముంబై ఇండియన్స్‌ మధ్య పూర్తిగా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ తర్వాత, ఐపిఎల్‌ అభిమానులు ఢిల్లీ క్యాపిటల్స్‌ – రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మరో అత్యధిక స్కోరింగ్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ తన మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో విజయం సాధించి.. ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటర్లు కెప్టెన్‌ సంజు శాంసన్‌, బట్లర్‌, జైశ్వాల్‌, షిమ్రాన్‌ హెట్మెయర్‌, ధ్రువ్‌ జురెల్‌ మంచి బ్యాటింగ్‌ లైనప్‌తో పటిష్టంగా ఉండగా బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్‌ శర్మ రాణిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ అభిమానులు ఇంకా కెప్టెన్‌ నుండి బాలిస్టిక్‌ బ్యాటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. భారీ ప్రమాదంలో గాయాల కారణంగా గత ఐపీఎల్‌ సీజన్‌కు దూరమైన రిషబ్‌ పంత్‌ మళ్లీ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లో పంత్‌ సత్తా చాటలేకపోయాడు. ఢిల్లీ జట్టులో డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి భీకర బ్యాటర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌ ఆసక్తిగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ జైపుర్‌లోని సవారు మాన్‌సింగ్‌ స్టేడియంలో జరగనుంది.

రాజస్థాన్‌ రాయల్స్‌ : యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రాన్‌ హెట్మెయర్‌, ధ్రువ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేష్‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్‌ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్‌ : డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, షారు హౌప్‌, రిషబ్‌ పంత్‌, కుమార్‌ కుషాగ్రా, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్రిచ్‌ నార్ట్జే, ముఖేష్‌ కుమార్‌ లు ఉన్నారు.

➡️