రష్యా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్‌ పోటీ

Dec 17,2023 12:10 #elections, #russia

మాస్కో :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రభుత్వ మద్దతు కలిగిన రియా వార్తా సంస్థ తెలిపింది. ప్రజల్లో విస్తృతమైన మద్దతు కలిగిన పుతిన్‌ పార్టీ టికెట్‌పై కాకుండా స్వంతంగా పోటీ చేస్తారని ఆయన మద్దతుదారుడైన ఓ సీనియర్‌ సభ్యుడు శనివారం తెలిపారు. అధ్యక్షుడిగా లేదా ప్రధానిగా రెండు దశాబ్దాలకు పైగా పుతిన్‌ అధికారంలో కొనసాగుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని పుతిన్‌ స్వయంగా ప్రకటించారు.   పాలక యునైటెడ్‌ రష్యా (యుఆర్‌) పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థ్ధిగానే బరిలోకి దిగుతారని పుతిన్‌ అనుయాయుడు ఆండ్రి తుర్చక్‌ అన్నారు.   పుతిన్‌కు మద్దతునిచ్చే జస్ట్‌ రష్యా పార్టీకి చెందిన సీనియర్‌ రాజకీయ నేత సెర్గి మిరొనొవ్‌ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆయనకు మద్దతుగా సంతకాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

➡️