వరుసగా మూడోసారి ససెక్స్‌తో పుజరా ఒప్పందం

Apr 12,2024 22:57 #Sports

లండన్‌: టీమిండియా టెస్ట్‌ బ్యాటర్‌ ఛటేశ్వర పుజరా వరుసగా మూడో ఏడాది కౌంటీల్లో ససెక్స్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. శుక్రవారం లిసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ తరఫున 2024 సీజన్‌ను ప్రారంభించాడు. 2022 సీజన్‌లో ససెక్స్‌ తరఫున 18మ్యాచులు ఆడిన ఈ ఏడాది డివిజన్‌ా1లో తొలి ఏడు మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపాడు. ఈ క్లబ్‌ తరఫున పుజరా గత రెండేళ్లలో 64.24యావరేజ్‌తో 1,863పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక 2023ా24 రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర తరఫున 13 ఇన్నింగ్స్‌లో 69.08 సగటుతో 829పరుగులు చేశాడు. గతంలో పుజరా డెర్భీషైర్‌, యార్క్‌షైర్‌, నాటింగ్హామ్‌టైర్‌లలోనూ ఆడిన అనుభవం ఉంది.

➡️