మానసిక సమస్యల పరిష్కారానికి సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ అవసరం : కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ పొన్నాడ.రాజశేఖర్‌

శ్రీకాకుళం -అర్బన్‌ : మానసిక సమస్యల పరిష్కారానికి ప్రొఫెషనల్‌ సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ఉన్నతమైన ప్రాధమిక ఎంపికని కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ పొన్నాడ.రాజశేఖర్‌ అన్నారు. స్థానిక డే అండ్‌ నైట్‌ కూడాలిలో మై కేర్‌ హాస్పిటల్‌, డాక్టర్స్‌ అండ్‌ డాక్టర్స్‌ ప్లాజాలో బుధవారం సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ సేవలను కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ రాజశేఖర్‌ పొన్నాడ ప్రారంభించి మాట్లాడుతూ … ప్రస్తుత కాలంలో సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ అవసరం సమాజంలో చాలా ఉందని, విద్యార్ధులు చదువులో వెనుకంజ, చెడు అలవాట్లు, తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, టీనేజ్లై లైఫ్‌ స్టైల్‌, భార్యాభర్తల మధ్య సమస్యలు, సెక్స్‌ పై సక్రమమైన అవగాహన, మానసిక ఒత్తిడి, భయాలు, బాధలు, అనవసర అలవాట్లు, ఏకాగ్రత లోపం, ఆత్మ విశ్వాసంలో అసమతుల్యతలు, ప్రేమ సమస్యలు, అనవసర ఆలోచనలు, జీవితంపై వైరాగ్యం, వ్యక్తిత్వ వికాశం లేకపోవడం వంటి పలు సమస్యలకు ప్రొఫెషనల్‌ కౌన్సిలింగ్‌ తప్పనిసరన్నారు. అలాగే మనీ మేనేజ్మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సిలింగ్‌ ఆవశ్యకత కూడా సమాజంలో చాలా ఉందని, ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించడానికి కఅషి చేస్తామన్నారు. అత్యాధునిక సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ విధానాలతో ఈ సేవలు అధికం చేస్తామని, విద్యార్థులను దఅష్టిలో ఉంచుకొని పట్టణాలతోపాటు, గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు, ఉచిత కౌన్సిలింగ్‌ సేవలతో విస్తఅతం చేస్తామని అన్నారు. రోగులంతా నేరుగా వచ్చి వైద్యాశాలను సంప్రదించవచ్చాన్నారు. అనంతరం డాక్టర్‌ బుడుమూరు రమణ యూరాలజిస్ట్‌, డాక్టర్‌ గురుగుబెల్లి సంధ్య గైనకాలజిస్ట్‌, ప్రభుత్వేతర వైద్యాశాలల పీఆర్వోస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జేఎస్‌ రాజు మాట్లాడుతూ … కౌన్సిలింగ్‌ తో నయమయ్యే మానసిక సమస్యల పరిష్కారానికి కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌ ల అవసరం సమాజంలో చాలా ఉందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

➡️